సరిహద్దులోపదిమంది పాక్ సైనికుల హతం
న్యూఢిల్లీః సరిహద్దులో భారత్ - పాక్ సేనల మధ్య మంగళవారం కూడా కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో పదిమంది వరకు పాకిస్తాన్ సైనికులు మరణించారు. 9 పాకిస్తాన్ బంకర్లను భారత్ సేనలు ధ్వంసం చేశారు. పూంఛ్ సెక్టర్ లో భారత్ వ్యూహాత్మకంగా పాక్ బంకర్లపై దాడులు నిర్వహిస్తున్నది. పూంఛ్, రాజోరి సెక్టర్లు మంగళవారం కాల్పుల మోతతో హోరెత్తిపోయాయి.
సరిహద్దులో భారత్ పెద్దఎత్తున సైన్యాన్ని మొహరించడమే ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తలకు కారణమని పాక్ ఆరోపించింది. తీవ్రవాద నేతల్ని అరెస్టు చేశామని, సాక్ష్యాలు చూపితే వారిని భారత్ కు అప్పగించేందుకు అభ్యంతరం లేదని చెప్పినా భారత్ ఇలా సేనల్ని మొహరించిందని పాక్ ధ్వజమెత్తింది.












Click it and Unblock the Notifications
