ముషారఫ్ కు ఓ ఛాన్స్ ఇవ్వండిఃబుష్
వాషింగ్టన్‌ః పాకిస్తాన్ లోని తీవ్రవాదులను శిక్షించేందుకు ముషారఫ్ కు ఓ అవకాశం ఇవ్వాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బుష్ భారత ప్రధాని వాజ్ పేయిని కోరారు. సంయమనం పాటించడం వల్ల ఉభయ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించే అవకాశం వుందని బుష్ అభిప్రాయపడ్డారు. సోమవారం నాడు టెక్సాస్ లో మాట్లాడుతూ తీవ్రవాదులను శిక్షించేందుకు పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను బుష్ ప్రశంసించారు. తీవ్రవాదుల్ని ఏరివేసే దిశగా పాక్ తీసుకుంటున్న చర్యలు నిజంగా హర్షణీయం అని ఆయన అన్నారు. వాజ్ పేయితో జరిపిన ఫోన్ సంభాషణను బుష్ వివరిస్తూ భారత పార్లమెంటుపై తీవ్రవాదులు దాడి జరపడం న్యూయార్క్ పై దాడి జరపడం వంటిదేనని చెప్పనట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications
