టెర్రరిజంపై భారత్‌విజయం ఖాయం
న్యూఢిల్లీః టెర్రరిజం పై ఎక్కుపెట్టిన పోరులో భారత్‌నే విజయలక్ష్మి వరిస్తుందని ప్రధాని వాజ్‌పేయి చెప్పారు. పాకిస్తాన్ తన భారత వ్యతిరేక వైఖరిని విడనాడి సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి చెబితే ఉపఖండంలో శాంతస్థాపనకు భారత్ శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నూతన సంవత్సరాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రధాని ప్రత్యేకంగా ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో సరిహద్దులను ప్రాణాలకు తెగించి కాపాడుతున్న జవాన్లకు, కీలక స్థావరాలను రేయింబవళ్లు కాపాడుతున్న భద్రతాదళాలకు, ఆహారభద్రతకోసం పరిశ్రమిస్తున్న రైతులకు, దేశ ఆర్ధిక రంగాన్ని పటిష్టంగా నిలిపివుంచుతున్న కార్మికులు, మేనేజర్లకు, దేశవిదేశాల్లో భారతీయ కీర్తిపతాకను ఎగురవేసిన సాఫ్ట్‌వేర్ నిపుణులకు, భావిభారత పౌరులకు, యువజనులకు జాతినిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంటున్న ప్రతి భారతీయునికి శుభాకాంక్షులు తెలియజేస్తున్నట్టుగా ప్రధాని చెప్పారు. కొత్త సంవత్సరం శాంతి సౌభాగ్యాలను కొనితేవాలని ఆయన ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications
