న్యూఇయర్ కు రాజకీయ రంగు
హైదరాబాద్‌ః రాష్ట్రంలో నూతనసంవత్సరం వేడుకలు ఎన్నికల రంగు పులుముకున్నాయి. హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి పట్టణాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారు నూతన సంవత్సరం వేడుకల్ని తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ప్రయత్నించారు. తమ ప్రాంతాల్లోని ప్రముఖ నాయకుల్ని టిక్కెట్లు ఆశించే వారంతా అనుచరులతో సహా కలుసుకొని వారిని పూలదండలతో ముంచెత్తారు. పనిలో పనిగా తమ టిక్కెట్ విషయం మరచి పోవద్దని పార్టీ నేతల్ని టిక్కెట్లు ఆశించే నేతలు కోరడం విశేషం.












Click it and Unblock the Notifications
