గ్రామసచివాలయ వ్యవస్థకుశ్రీకారం
నిజామాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ లో గామీణ వ్యవస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ గ్రామసచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతనసంవత్సరం తొలిరోజు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం అడ్లూరు లో గ్రామసచివాలయ వ్యవస్థను చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అడ్లూరు సర్పంచ్ తో కలిసి స్వయంగా గ్రామసభను నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి పల్లెల అభివృద్ధే ప్రధానమని అన్నారు. అందుకోసమే పల్లెల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు వినూత్న రీతిలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు ఇంత ఆర్భాటంగా గ్రామసచివాలయ వ్యవస్థ ను ప్రారంభించినప్పటికీ పల్లెల్లో గ్రామకార్యదర్శులది ఇష్టారాజ్యంగా మారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామకార్యదర్శి ఇక నేరుగా ప్రభుత్వానికి జవాబుదారు కావడంతో వ్యవస్థలో మరిన్ని లోపాలు చోటుచేసుకొనే ప్రమాదం వుందని నిపుణులు అంటున్నారు.