హైదరాబాద్‌ః
నగరానికి
చెందిన
సంపన్న
పారిశ్రామికవేత్తను
ఆయన
భార్యాను
కిడ్నాప్
చేసి
పారిశ్రామికవేత్తను
హత్యచేసిన
ఒక
యువకుడిని
24
గంటలలోపే
పోలీసులు
అరెస్టు
చేశారు.
డిసెంబర్
31
అర్ధరాత్రి
నగరమంతా
నూతన
సంవత్సరానికి
స్వాగతం
పలికే
సంబరాల్లో
మునిగితేలుతుండగా
ఈ
కిడ్నాప్
హత్య
సంఘటన
జరిగాయి.
కిడ్నాపర్
చేతిలో
వ్యాపారవేత్త
హత్యకు
గురికాగా
ఆయన
భార్య
తీవ్ర
గాయాలతో
ప్రస్తుతం
ఆస్పత్రిలో
వుంది.
కిడ్నాపర్
హత్యకు
గురైన
పారిశ్రామిక
వేత్త
పొరుగింటివాడే
కావడం
విశేషం.
కిడ్నాప్
గురించి
తెలిసిన
వెంటనే
నగరాన్ని
దిగ్బంధం
చేసిన
పోలీసులు
24
గంటల్లోనే
కిడ్నాపర్‌ను
అరెస్టు
చేసి
కత్తులు,
తుపాకులు
ఇతర
మారణాయుధాలు
స్వాధీనం
చేసుకున్నారు.
ఈ
సంఘటనకు
సంబంధించిన
వివరాలు
పోలీసులు
వెల్లడించారు.
సరోజినిదేవి
రోడ్‌లో
నివసించే
సంపన్న
పారిశ్రామికవేత్త
దూల్‌చంద్
సురానా
ఆయన
భార్య
మంజు
సురానా
కొత్త
సంవత్సరం
వేడుకల్లో
పాల్గొనేందుకు
సోమవారం
రాత్రి
తమ
ఇంటినుంచి
తమ
పిల్లలతో
కలిసి
రెండు
కార్లలో
బయలుదేరారు.
సురానా
దంపతులు
వెళ్లుతున్న
కారును
వారి
పొరిగింటిలో
వుండే
మరో
వ్యాపారవేత్త
సుశిల్
బొహ్ర
కుమారుడు
మయాంక్
బొహ్ర
అలియాస్
విక్కీ
బేగంపేట
పబ్లిక్
స్కూల్
సమీపంలో
నిలిపివేశారు.
లిఫ్ట్
కావాలని
అడగటంతో
తెలిసిన
వాడే
కావడంతో
విక్కీని
సురానా
తమ
కార్లో
కూచోబెట్టుకున్నారు.
కార్లో
కూచున్న
విక్కీ
తుపాకీతో
బెదిరించి
సురానా
దంపతులను
నిర్మానుష్యంగా
వుండే
మహేంద్ర
హిల్స్
ప్రాంతానికి
తీసుకువెళ్లాడు.
కోటి
రూపాయలు
కావాలని
డిమాండ్
చేశాడు.
సురానా
తిరస్కరించడంతో
విచక్షణరహితంగా
కత్తితో
పొడిచాడు.
అడ్డువచ్చిన
మంజు
కూడా
కత్తిపోట్లకు
గురైంది.
రక్తం
మడుగులో
పడివున్న
సురానా
దంపతులను
పోలీసులు
ఆస్పత్రికి
చేర్చగా
సురానా
ఆస్పత్రిలో
మరణించారు.
కిడ్నాప్
వార్త
తెలిసిన
వెంటనే
పోలీసులు
అప్రమత్తమై
గాలింపు
జరపడంతో
కిడ్నాపర్
విక్కీ
దొరికాడు