ముషారఫ్ శాంతి జపం!
ఇస్లామాబాద్‌ః భారత పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని నివారించేందుకు పాకిస్తాన్ సైనికాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నడుం కట్టారు. జనవరి నాలుగున ఖాట్మండూలో ప్రారంభం కానున్న సార్క శిఖరాగ్ర సదస్సును ముషారఫ్ తన ప్రయత్నాలకు వేదికగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సార్క్ శిఖరాగ్రం సందర్భంగా వాజ్ పేయి-ముషారఫ్ చర్చలు జరిపే అవకాశం వుందనే ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో ముషారఫ్ శాంతి యత్నాలు జరపడం విశేషం. అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్ పావెల్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ , శ్రీలంక అధ్యక్షురాలు, సార్క్ సారధి చంద్రికా కుమారతుంగతో ముషారఫ్ ఈ దిశగా ఇప్పటికే సంప్రదింపులు జరిపారని వినికిడి.












Click it and Unblock the Notifications
