పేదలకోసం శరత్‌దీక్షిత్‌ శిబిరం

హైదరాబాద్‌ః పేదల కోసం అంతర్జాతీయ ఖ్యాతిపొందిన ప్లాస్టిక్‌ సర్జన్‌ ప్రవాస భారతీయుడు శరద్‌ కుమార్‌ దీక్షిత్‌ హైదరాబాద్‌లో అయిదురోజుల పాటు ప్లాస్టిక్‌ సర్జరీ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఐఐఎం పూర్వవిద్యార్ధుల సంఘం, సిడిఆర్‌ ఆస్పత్రి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. శారీరకంగా వికలాంగుడైనప్పటికీ శరత్‌ కుమార్‌ దీక్షిత్‌ గత మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. .

సాధారణ వైద్య సేవలను ప్రజలకు అందించడానికే ప్రభుత్వం నానాపాట్లు పడుతున్నదని హైటెక్‌ వైద్యం ప్రజలకు ముఖ్యంగా పేదలకు చౌకగా అందుబాటులోకి రావాలంటే స్వచ్ఛంద సంస్థలే నడుంకట్టాలని ఈ శిబిరానికి ప్రారంభోత్సం చేస్తూ హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ కోరారు. హైటెక్‌ వైద్యం ప్రాణవసమైనప్పటికీ పేదలకు అందుబాటులోకి తేవడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతున్నదని ఆయన చెప్పారు. గ్రహణం మొర్రి, మచ్చలు, ఇతర వైకల్యాలు వున్న పేదలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ శిబిరంలో ప్లాస్టిక్‌ సర్జరీ చేస్తారు. ప్రాణం వున్నంతవరకు పేదలకు వైద్య సాయం అందించడమే తన లక్ష్యమని శరద్‌ కుమార్‌ దీక్షిత్‌ చెప్పారు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+