తాజ్‌ మహల్‌పేల్చివేస్తామన్న లష్కర్‌

లక్నోః ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక కట్టడం తాజ్‌ మహల్‌ ను పేల్చి వేస్తామని లష్కర్‌ -ఎ-తొయిబా తీవ్రవాదులు బుధవారం హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ ను చంపుతామని, అయోధ్యలో తాత్కాలికంగా నిర్మించిన రామమందిరాన్ని ధ్వంసం చేస్తామంటూ రాజ్‌ నాధ్‌ సింగ్‌ కు మంగళవారం ఇ-మెయిల్‌ వచ్చింది. లష్కర్‌-ఎ-తొయిబా తీవ్రవాదులు ఇ-మెయిల్‌ పంపినట్లు భావిస్తున్నారు.

ఈ మెయిల్‌ దరిమిలా తాజ్‌ మహల్‌ వద్ద బందోబస్తు పటిష్ఠం చేశారు. తాజ్‌ మహల్‌ తో పాటు ఉత్తర ప్రదేశ్‌ లోని అన్ని చారిత్ర కట్టడాల వద్ద బందోబస్తును పటిష్టం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. భారత్‌ - పాక్‌ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో తాజ్‌ మహల్‌ కు మిలటరీ దుస్తులు వేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. పాకిస్తాన్‌ చారిత్రక తాజ్‌ మహల్‌ పై గురిపెట్టవచ్చనే ఆలోచనతో 1971 యుద్ధం సమయంలో కూడా ఇదే విధంగా తాజ్‌ మహల్‌ ను కప్పివేశారు. ఈ లోగా తాజ్‌ ను పేల్చి వేస్తామని బెదిరింపు రావడం గమనార్హం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+