వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనధికార చర్చలుకు వాజ్‌పేయి దూరం
ఖాట్మండూః సార్క్ సదస్సు సందర్భంగా భారత్ - పాక్ అధినేతలు చర్చలు జరిపే అవకాశాలకు తెరపడింది. సార్క్ దేశాధినేతల మధ్య ప్రారంభమైన అనధికార చర్చలకు భారత ప్రధాని వాజ్ పేయి దూరంగా వున్నారు. సార్క్ వేదికపై ముషారఫ్ నాటకీయంగా వ్యవహరించి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటికీ భారత్ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. అనధికారిక చర్చలకు హాజరై ముషారఫ్ తనను మరోసారి కలిసే అవకాశం ఇవ్వరాదని వాజ్ పేయి సంకల్పించారు. వాజ్ పేయి ఇప్పటికే సార్క్ దేశాలకు చెందిన అందరు నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక విషయాలు వివరంగా చర్చించారు.
Comments
Story first published: Saturday, January 5, 2002, 23:53 [IST]