వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాటలు కాదు... చేతలు కావాలిః జస్వంత్
ఖాట్మండూః మాకు మాటలు కాదు.... చేతలు కావాలని భారత్ తేల్చిచెప్పింది. మెహర్బానీ వ్యవహారాలకు స్వస్తి చెప్పి తీవ్రవాదులను నిర్మూలించే దిశగా పాక్ పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ సార్క్ ప్రారంభ సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు. పాక్ భారత్ తో స్నేహం కోరుకుంటే అంతకు మించి కావలసింది ఏ ముంది.... అయితే పాక్ స్నేహంలో నిజాయితీ ఎంత అన్నదే ప్రశ్నార్థకం అని జస్వంత్ సింగ్ అన్నారు. ముషారఫ్ వాజ్ పేయికి షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన భారత-పాక్ సంబంధాలు బాగుపడవు... ఇదేమీ పబ్లిక్ రిలేషన్స్ వ్యవహారం కాదని జస్వంత్ సింగ్ కటువుగా చెప్పారు.
Comments
Story first published: Saturday, January 5, 2002, 23:53 [IST]