కాశ్మీర్‌ పోరాటం తీవ్రవాదం కాదు

ఖాట్మండుః ఉపఖండంలో శాంతి సుస్థిరతలకోసం తాము శాయశక్తుల కృషి చేస్తున్నామని పాకిస్తాన్‌ అధ్యక్షుడు జనరల్‌ ముషారఫ్‌ చెప్పారు. తాము పూర్తి స్థాయిలో సంయమనంతో వ్యవహరిస్తున్నామని తీవ్రవాద శక్తులను ఏరివేసేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నదని సార్క్‌ శిఖరాగ్ర సభలో ప్రసంగిస్తూ ఆయన చెప్పారు.

అయితే తీవ్రవాదానికి, చట్టబద్దంగా జరిగే పోరాటాలకు మధ్య తేడాను గుర్తించాల్సి వున్నదని ఆయన కాశ్మీర్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ చెప్పారు. కాశ్మీర్‌లో జరుగుతున్న పోరాటాన్ని ఆయన స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారు. ప్రజల్లో నిరాశ, నిస్పృహలకు కారణాలను గుర్తించాలని ఆయన అన్నారు. ఉపఖండంలో శాంతి సుస్థిరతల కోసం భారత ప్రధాని వాజ్‌పేయితో కలిసి పనిచేయడానికి పాకిస్తాన్‌ సిద్ధంగా వున్నదని సభాముఖంగా తెలియజేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. సార్క్‌ సభ్య దేశాల మధ్య ఉద్రిక్తతలు ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదంపై పోరు విషయంలో తమ చిత్తశుద్ధిని యావత్‌ ప్రపంచం గుర్తించిందని ఆయన చెప్పుకున్నారు. ఇదిలా వుండగా తొలుత భారత అధికారులను ప్రధాని వాజ్‌పేయిని ఒక్కసారిగా విస్మయంలో ముంచెత్తుతూ, పాక్‌ నేత ముషారఫ్‌ తానే స్వయంగా వాజ్‌పేయి వద్దకు వచ్చే కరచాలనం చేశారు. తనది నిఖార్సైన స్నేహానికి అందిస్తున్న హస్తమని ముషారఫ్‌ చెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+