వెన్నుపోటు పాక్ నైజంః వాజ్‌పేయి
ఖాట్మండూః భారత దేశంలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్న తీవ్రవాదులపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రధాని వాజ్ పేయి సార్క్ వేదిక నుంచి పిలుపునిచ్చారు. ప్రసంగపాఠాన్ని పక్కన పెట్టి వాజ్ పేయి సొంతంగా ప్రసంగించారు. అనూహ్య రీతిలో తనకు కరచాలన చేసిన ముషారఫ్ ను వాజ్ పేయి ఏ మాత్రం వదిలిపెట్టకుండా విమర్శించారు. వాజ్ పేయి ప్రసంగిస్తున్నంత సేపూ ముషారఫ్ ముఖాన్ని కందగడ్డలా చేసుకొని చూస్తూ కూర్చున్నారు.
ఆఫ్గనిస్తాన్ తీవ్రవాదానికి ఆశ్రయం ఇచ్చి ఈ రోజున పాప ఫలితాన్ని అనుభవిస్తున్నదని, పాకిస్తాన్ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టికోవాలని వాజ్ పేయి మరో చురక తగిలించారు. సార్క్ దేశాలు ఉమ్మడిగా పేదరికం నిర్మూలనకు కృషి చేయాలని వాజ్ పేయి ఏడు సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు.
భారత దేశం 20ఏళ్ళుగా తీవ్రవాద దుష్ప్రభావానికి గురైంది. సార్క్ సభ్య దేశాలు కూడా తీవ్రవాదం వల్ల కష్టాలు పడుతున్నాయి. ఈతీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అన్నిదేశాలు కృషి చేయాలని వాజ్ పేయి
పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications
