కుషాయిగూడలో పేలుడు-ఇద్దరుమృతి

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ లోని కుషాయిగూడలో ఆదివారం ఉదయం భారీ విస్ఫోటనం సంభవించి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు ఈ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్‌ సిలెండర్‌ పేలి ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతుండగా, పేలుడు పదార్ధాలు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పేలుడు ధాటికి కుషాయిగూడలోని ఓ వ్యాపారి ఇల్లు కూలిపోయింది. గ్యాస్‌ సిలెండర్‌ పేలిన కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన చెబుతున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజధాని నగరంలో జరిగిన ఈ పేలుడు సంచలనం సృష్టించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+