వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

గుడ్ గవర్నెన్స్ కేంద్రానికి బ్లెయిర్‌శ్రీకారం
హైదరాబాద్‌ః బ్రిటన్ ప్రధానికి హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బెంగుళూరు నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ కు విమానాశ్రయంలో గవర్నర్ రంగరాజన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రివర్గ సహచరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి బ్లెయిర్ నేరుగా జూబ్లీ హిల్స్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు చేరుకున్నారు. అక్కడ ఆయన గుడ్ గవర్నెన్స్ సెంటర్ ను ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలను అమలు చేసే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటి సారిగా బ్రిటన్ కు చెందిన డిపార్ట్ మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డవలప్ మెంట్ స్థాపించన ఈ గుడ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ఏకంగా బ్రిటన్ ప్రధానే ప్రారంభించడం విశేషం.
Comments
Story first published: Sunday, January 6, 2002, 23:53 [IST]