న్యూఢిల్లీః
ఇజ్రాయెల్లో
చురుగ్గా
వున్న
తీవ్రవాద
సంస్థ
హమాస్
సానుభూతి
పరులుగా
భావిస్తున్న
వారిని
అదుపులోకి
తీసుకునేందుకు
ఉత్తరప్రదేశ్,
ఢిల్లీ
పోలీసులు
ముమ్మరంగా
గాలింపు
జరుపుతున్నారు.
ఇజ్రాయెల్
విదేశాంగ
మంత్రి
పెరజ్
భారత్
పర్యటనకు
వస్తున్న
నేపథ్యంలో
పోలీసులు
యంత్రాంగం
అప్రమత్తమైంది.
రా,
ఇంటలిజెన్స్
బ్యూరో
వంటి
సంస్థలు
అందించిన
సమాచారం
మేరకు
దాడులు
కొనసాగిస్తున్నట్టుగా
అధికారులు
చెప్పారు.
పలువురిని
అదుపులోకి
తీసుకుని
ప్రశ్నిస్తున్నట్టుగా
తెలిసింది.
లక్నోలో
హమాస్
మద్దతుదారులుగా
భావిస్తున్న
ముగ్గురు
విద్యార్ధులను
అరెస్టు
చేశారు.
ఈ
ముగ్గురిలో
ఒకరు
జోర్డాన్కు
చెందిన
వారు
కాగా
ఒకరు
పాలస్తీనాకు
చెందినవారు.
అయితే
తాము
ఇక్కడకు
కేవలం
చదువుకోవడానికి
మాత్రమే
వచ్చామని
ఏ
సంస్థతోనూ
తమకు
సంబంధం
లేదని
అరెస్టయిన
విద్యార్ధులు
అంటున్నారు.