హైదరాబాద్‌ః
తెలుగు
నేల
నలుచెరగులా
16వ
విడత
జన్మభూమి
కోలాహలంగా
జరుగుతున్నది.
మంత్రులు,
ఎమ్మెల్ల్యేలు,
అధికారులు
పల్లెపల్లెనా
అభివృద్ధి
కార్యక్రమాలలో
పాల్గొంటున్నారు.
పలుచోట్ల
ప్రజలు
అధికారులను
నిలదీస్తున్నారు.
జన్మభూమి
ఆరోరోజున
రాష్ట్ర
పౌరసరఫరాల
మంత్రి
కోడెల
శివప్రసాదరావు
మంగళగిరి
మండలం
చినకాకానితో
పాటు
దుగ్గిరాల
గ్రామాలలో
జరిగిన
గ్రామసభలలో
పాల్గొన్నారు.
చినకాకానిలో
జరిగిన
గ్రామసభలో
కాంగ్రెస్,
వామపక్ష
పార్టీలకు
అధికార
తెలుగుదేశం
పార్టీ
కార్యకర్తలకు
మధ్య
వాగ్వివాదం,
తోపులాటలు
జరిగాయి.
రేషన్
కార్డులు
పంపిణీ
చేయాలంటూ
ప్రతిపక్ష
కార్యకర్తలు
డిమాండ్
చేయడంతో
మంత్రి
సర్దిచెప్పే
ప్రయత్నం
చేసినప్పటికీ
ఫలితం
లేకపోయింది.
అధికార
పార్టీ
కార్యకర్తలు
కాంగ్రెస్,
వామపక్ష
కార్యకర్తలను
అడ్డుకోవడంతో
ఉద్రిక్తతలు
చోటుచేసుకున్నాయి.
కడపజిల్లాలో
సోమవారం
ముఖ్యమంత్రి
పాల్గొనాల్సిన
కార్యక్రమాలు
వాయిదా
పడడంతో
మంత్రులు
రామసుబ్బారెడ్డి,
సరస్వతులు
వివిధ
కార్యక్రమాల్లో
పాల్గొన్నారు.