జమ్మూః పాకిస్తాన్‌కు చెందిన రెండు పైలెట్ రహిత గూఢచార విమానాలు ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో భారత గగనతలంలోకి చొచ్చుకుని వచ్చాయి.
వాటిలో ఒక విమానాన్ని భారత దళాలు కూల్చివేశాయి. ఈ విషయం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. అయితే తమ విమానాన్ని కూల్చివేసినట్టుగా భారత్ చేస్తున్న ప్రకటనను పాకిస్తాన్ ఖండించింది. ఇదిలా వుండగా వేరక సంఘటనలో భారత్‌కు చెందిన మరో పైలెట్ రహిత విమానం ప్రమాదవశాత్తు నేలకూలినట్టుగా అధికారులు వెల్లడించారు.