తంపా(ఫ్లోరిడా)ః
పైలెట్‌గా
శిక్షణ
పొందతున్న
పదిహేనేళ్ల
కుర్రాని
దూకుడు
చేష్ట
అమెరికాలో
ఒక్కసారిగా
కలకలం
సృష్టించింది.
స్కూల్
కుర్రాడు
నడుపుతున్న
చిన్నపాటి
విమానం
42
అంతస్తుల
భవనాన్ని
ఢీకొన్న
సంఘటనలో
ఆ
కుర్రాడు
అక్కడికక్కడే
మరణించాడు.
మొదటి
దీనిని
ఆక్సిడెంట్‌గా
భావించినప్పటికీ
ఆ
తర్వాత
జరిపిన
దర్యాప్తులో
కుర్రాడు
ఒసామా
బిన్
లాడెన్
అభిమాని
అని
తెలిసింది.
ఈ
మేరకు
ఒక
నోట్
ఆ
కుర్రాడి
జేబులో
దొరికినట్టుగా
ఆధికారులు
చెబుతున్నారు.
పూర్తి
వివరాలు
ఇంకా
తెలియాల్సి
వుంది.
ముందే
అప్రమత్తం
కావడంతో
భారీ
అగ్నిప్రమాదం,
ఆస్తినష్టం
వంటివి
జరగలేదని
అధికారులు
ప్రకటించారు.
ఈ
సంఘటన
జరిగిన
వెంటనే
మళ్లీ
డబ్లుటివో
తరహా
దాడులకు
టెర్రరిస్టులు
తెగబడ్డారంటూ
పుకార్లు
వ్యాపించడంతో
అమెరికా
అప్రమత్తమయింది.
ఆ
తర్వాత
ఇది
కేవలం
ఆక్సిడెంట్
అని
ప్రకటించారు.
చివరకు
ఉద్దేశ్యపూర్వకంగానే
చార్లెస్
జె
బిషప్
అనే
కుర్రాడు
ఈ
దాడికి
పాల్పడినట్టుగా
వెల్లడయింది.
తొమ్మిదో
తరగతి
చదువుతున్న
చార్లెస్
జె
బిషప్
అనే
పదిహేనేళ్ల
కుర్రాడు
తంపాలో
కొంతకాలంగా
విమానాలు
నడపడంలో
శిక్షణ
పొందుతున్నాడు.
శనివారం
నాడు
తన
నానమ్మతో
కలసి
క్లాసుల
కోసం
తంపా
విమానాశ్రాయనికి
వచ్చాడు.
విమానాలు
నడపడంలో
శిక్షణ
ఇచ్చే
ట్రెయినర్
ప్రీ
పైలెట్
చెక్స్
చేయాల్సిందిగా
చెప్పి
పక్కకు
వెళ్లగానే
పైలెట్
అనుమతి
లేకుండా
బిషప్
ఒక్కసారిగా
విమానాన్ని
గాలిలోకి
లేపాడు.
బిత్తరపోయిన
గ్రౌండ్
కంట్రోల్
వెంటనే
అప్రమత్తం
చేయడంతో
బిషప్
విమానాన్ని
నేలకు
సురక్షితంగా
దించడానికి
రెండు
రక్షణ
శాఖ
హెలికాప్టర్లు
కూడా
బయలుదేరాయి.
యితే
హెలికాప్టర్లలోని
పైలెట్ల
హెచ్చరికను
లెక్కచేయకుండా
ముందుకు
దూసుకుపోయిన
బిషప్
విమానం
బ్యాంక్
ఆఫ్
అమెరికా
బహుళ
అంతస్తుల
సౌధంలోని
28వ
అంతస్తును
ఢీకొట్టాడు.
విమానం
ఇంజన్
భాగం
భవంతిలోనే
ఇరుక్కుపోగా
రెక్కలు,
తోకభాగం
నేలకూలాయి.
ముందుజాగ్రత్తగా
అగ్నిప్రమాదం
జరగకుండా
పెద్దఎత్తున
ఫోమ్‌ను
గుమ్మరించారు.
ఉద్దేశ్యపూర్వకంగానే
బిషప్
ఈ
చర్యకు
పాల్పడినట్టుగా
చెబుతున్నప్పటికీ
బిషప్
ప్రయాణించిన
మార్గంలో
అతిపెద్ద
సైనిక
స్థావరం
కూడా
వున్నదని
విద్రోహం
ఆలోచన
వుంటే
బిషప్
తన
విమానాన్ని
అక్కడే
కూల్చేవాడని
కూడా
కొందరు
వాదిస్తున్నారు.