ప్రజల చెరలో పోలీసులు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ వివాదాస్పదంగా మారింది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది పీపుల్స్‌వార్ దళ సభ్యుడని పోలీసులు చెబుతుండగా పోలీసులు అమాయకుడ్ని పట్టుకెళ్లి కాల్చి చంపారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులను ప్రజలు నిర్బంధించి దుర్భాషలాడారు. రాత్రి పది గంటల తర్వాత వారిని వదిలిపెట్టారు. పోలీసులు శవాన్ని తీసుకుని వెళ్లకుండా అడ్డుకున్నారు.
అయితే పోలీసుల కథనంతో ప్రజలు విభేదిస్తున్నారు. అమాయకుడైన మధుకర్‌ను పోలీసులు కాల్చి చంపారని వీరంటున్నారు. కట్టెల కోసం అడవికి వెళ్లిన మధుకర్‌ను
పోలీసులు కాల్చి చంపారనేది ప్రజల వాదన. ఇతను కట్టెలు అమ్ముకుని జీవిస్తాడని వీరంటున్నారు.
మధుకర్ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడని, అతనిపై ఇది వరకు ఏ విధమైన కేసులు లేవని ప్రజలు చెప్పారు. మధుకర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అతని తమ్ముడు శ్రీనివాస్‌కు ఉద్యోగం ఇవ్వాలని, ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేశారు. అందుకు మందమర్రి ఎమ్మార్వో అంగీకరించి ప్రజలను శాంత పరిచే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications
