కరెంటు ఛార్జీలపై సంప్రదింపులు: బాబు

విశాఖపట్నం: అన్ని వర్గాలను సంప్రదించి పారదర్శకంగానే ఛార్జీలు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు.

ఛార్జీల వసూళ్లు, పంపిణీ, సరఫరాలపై మాత్రమే కసరత్తు జరుగుతోందని, ఛార్జీల పెంపుపై ఇంత వరకు ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.

ఛార్జీల వసూళ్లను, పంపిణీని, సరఫరాను ఎపిఇఆర్‌సి సమీక్షిస్తోందని ఆయన చెప్పారు. కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడెక్కడ వ్యయాన్ని తగ్గించి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా కరెంట్‌ సరఫరాను చేయవచ్చునో కూడా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఛార్జీల నిర్ణయం జరుగుతుందని ఆయన చెప్పారు.

అన్ని వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం మ్యాచింగ్‌ గ్రాంటుతో సిమెంటు రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కువ గ్రాంట్లు ఎక్కడ వస్తే అక్కడ పనులు చేపడుతామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+