ఆంధ్రలో బిస్మిల్లాఖాన్ కు అవమానం
హైదరాబాద్‌ః భారతరత్న, ప్రపంచప్రఖ్యాత షెహనాయ్ విద్యాంసుడు బిస్మిల్లా ఖాన్ కు తెలుగునేలపై తీరని అవమానం జరిగింది. ఎపిటూరిజం శాఖ నాలుగురోజులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో బిస్మిల్లా ఖాన్ కార్యక్రమం కూడా వున్నట్లు ప్రచారం చేశారు. బుధవారం జరిగాల్సిన బిస్మిల్లా ఖాన్ కార్యక్రమాన్ని చివరిక్షణంలో రద్దు చేశారు. చివరకు ఆయనకు దారిఖర్చులు కూడా ఇవ్వకుండా ఎ.పి.టూరిజం శాఖ చేతులు దులుపుకుంది. ఎ.పి.కళావేదిక కన్వీనర్ రమణమూర్తి టూరిజం శాఖ తరపున బిస్మిల్లా ఖాన్ తో మాట్లాడి హైదరాబాద్ లో ప్రోగ్రాం ఇచ్చేందుకు ఒప్పించారు. బిస్మిల్లా ఖాన్ తన బృందంతో సహా హైదరాబాద్ నగరం చేరుకొని ఓ హోటల్ లో బసచేశారు.












Click it and Unblock the Notifications
