విదేశీ మద్దతుకు ఎంపీల పర్యటనలు
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదంపై, జమ్మూ కాశ్మీర్‌పై భారత వైఖరిని స్పష్టం చేసేందుకు పాలక, ప్రతిపక్షాలకు చెందిన 40 మంది పార్లమెంటు సభ్యుడు దాదాపు డజను దేశాల్లో పర్యటిస్తారు. దౌత్యపరమైన చర్యల్లో భాగంగా పార్లమెంటు సభ్యులను వివిధ దేశాలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పార్లమెంటు సభ్యులు అమెరికా, బ్రిటన్, జర్మనీ, మలేసియా, ఇండోనేషియాల్లో, పలు మధ్య ప్రాచ్య దేశాల్లో పర్యటిస్తారు.
ఉగ్రవాదంపై పోరు చేసే విషయంలో పార్టీలకతీతంగా ఒకే మాటపై ఉన్నామని అంతర్జాతీయ ప్రపంచానికి తెలియజేయడానికి ఈ పర్యటనలు పనికి వస్తాయని బిజెపి అధికార ప్రతినిధి వి.కె. మల్హాత్రా బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications
