భారతగగనతలంలో పాక్‌ విమానం

న్యూఢిల్లీః పాకిస్తాన్‌ కు చెందిన పైలట్‌ లేని విమానం ఒకటి బుధవారం భారత గగనతలంలోకి ప్రవేశించింది. సుమారు 15 నిమిషాలపాటు ఆ విమానం భారత గగనతలంలో చక్కర్లు కొట్టింది. అనుమతిలేకుండా భారత భూభాగంలోకి వచ్చిన ఆ విమానాన్ని కూల్చేందుకు భారత్‌ సేనలు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కొద్దిసేపు చక్కర్లు కొట్టిన అనంతరం ఆ విమానం వెనుతిరిగి పోయింది. ఇదే సమయంలో ఓ హెలికాప్టర్‌ కూడా భారత గగనతలంలోకి ప్రవేశించినట్లు కూడా రక్షణ వర్గాలు అనుమానిస్తున్నారు.

ఇదిలా వుండగా భారత్‌ - పాక్‌ సరహద్దుల్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పూంఛ్‌, రాజోరి సెక్టార్లలో బుధవారం కూడా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని సమాచారం అందింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+