రాజమండ్రిలో దేశం-బిజెపి ఖటీఫ్
రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షమైన భారతీయ జనతాపార్టీలు ఉమ్మడిపోరుకు ఒక ఆంగీకారానికి రాలేకపోయాయి. దీంతో ఉభయ పార్టీలు ఒంటరి పోరాటానికి సిద్ధం అయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన రాజమండ్రి కార్పొరేషన్ కు జరుగుతున్న ఎన్నికల్లో 44 స్థానాలకు గాను పది స్థానాలను బిజెపికి కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. అయితే రెండు మినహా మిగిలిన స్థానాలు బిజెపికి ఏ మాత్రం పట్టు లేని స్థానాలను కేటాయించడంతో బిజెపి వర్గాలు తెలుగుదేశంపై మండిపడ్డాయి.












Click it and Unblock the Notifications
