ఇక పాక్ మోసాలు సాగవుః అద్వానీ
న్యూయార్క్‌ః పాక్ చేతిలో మరోసారి మోసపోదలచుకోలేదని భారత హోం శాఖ మంత్రి ఎల్.కె.అద్వానీ స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగమంత్రి కొలెన్ పావెల్ తో గురువారం ఆయన చర్చలు జరిపారు. ఆతరువాత అద్వానీ, పావెల్ ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్ వైఖరి అర్థం చేసుకోతగిందేనంటూ పావెల్ పరోక్షంగా పాక్ ను సమర్థించారు. పాక్ తీవ్రవాదులపై సత్వరం చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్ లో వున్న తీవ్రవాదుల జాబితాను భారత్ తనకు అందించిందని, ఈ జాబితాలో వున్న వ్యక్తులపై పాక్ అధ్యక్షుడు ముషారఫ్ చర్యలు ప్రారంభించే వుంటారంటూ పావెల్ ముషారఫ్ ను వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నించారు.ఉద్రిక్తతల నివారణకు వచ్చే వారం భారత్, పాక్ లలో పర్యటించనున్నట్లు పావెల్ చెప్పారు.












Click it and Unblock the Notifications
