జెహనాబాద్: పోలీసులతో జరిగిన హోరాహోరి ఎదురు కాల్పుల్లో బుధవారం రాత్రి బీహార్‌లోని కోజియామ్ బారా గ్రామం ఐదుగురు నిషిద్ధ పీపుల్స్‌వార్ గ్రూప్ తీవ్రవాదులు హతమయ్యారు.
తమకు అందిన సమాచారం మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సహకారంతో పోలీసు పెట్రోలింగ్ పార్టీ ఆర్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామంలో నేర కార్యక్రమం కోసం ప్రయత్నిస్తున్న తీవ్రవాదులను ఎదుర్కుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు తీవ్రవాదులు అక్కడికక్కడే మరణించారు. సంఘటనా స్థలం నుంచి లూటీ చేసిన పోలీసు రైఫిళ్లను, ఒక పిస్టల్‌ను, ఒక హ్యాండ్ గ్రెనేడ్‌ను, తదితర మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదులు ప్రతీకార చర్యకు దిగవచ్చుననే అనుమానంతో అర్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో గస్తీని ముమ్మరం చేశారు.