వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హద్దుమీరిన పాక్ -ఆరుగురు సైనికుల హతం
శ్రీనగర్‌ః భారత పాకిస్తాన్ దళాల మధ్య సరిహద్దులో గురువారం జరిగిన కాల్పుల్లో ఆరుగురు పాకిస్తాన్ జవాన్లు మరణించారు. వాస్తవాధీన రేఖ వెంట వున్న ఛాత్రి పోస్ట్ ను స్వాధీనం చేసుకొనేందుకు పాకిస్తాన్ సేనలు చేసిన ప్రయత్నాన్ని భారత్ సేనలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం జరిగిన భీషణ సమరంలో ఆరుగురు పాక్ సైనికులు మరణించారని అధికార వర్గాలు చెప్పాయి. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో భారత్ భూభాగంలో వున్న పోస్ట్ ను స్వాధీనం చేసుకొనేందుకు పాక్ సేనలు ప్రయత్నించి భంగపడ్డాయి.
Comments
Story first published: Thursday, January 10, 2002, 23:53 [IST]