వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌-పాక్‌ యుద్ధం ఛాన్స్‌ తక్కువే!

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః భారత్‌ - పాకిస్తాన్‌ ల మధ్య భారీ స్థాయిలో యుద్ధం జరిగే అవకాశాలు లేవని అమెరికా ఇంటెలిజన్స్‌ వర్గాలు అంచనావేశాయి. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం వస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌ పాక్‌ ల మధ్య యుద్ధం వస్తే భారత్‌ లోని రాజస్థాన్‌, పాకిస్తాన్‌ లోని పంజాబ్‌ రాష్ట్రాల్లో కనీసం పదిలక్షల మంది వేరేచోటికి తరలిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికా నిపుణులు భావిస్తున్నారు.

అమెరికాకు చెందిన 13 ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఈ మేరకు రూపొందించిన నివేదికను జనవరి 9న విడుదల చేశారు. అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మరో యుద్ధాన్ని భరించడం, ఆ దేశాలకు సహాయం చేయడం కష్టతరమే అని ఆ నివేదికలో పేర్కొనడం విశేషం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X