వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో టాప్ జైష్ లీడర్ అరెస్టు
ఇస్లామాబాద్: ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్‌లపై చర్యలు తీసుకోవడంలో భాగంగా పాకిస్థాన్ పోలీసులు జైష్- ఎ- మహ్మద్ సీనియర్ నాయకుడు హసన్ బర్కీని అరెస్టు చేశారు. పంజాబ్ ప్రొవిన్స్‌లోని బహవల్పూర్ నుంచి వచ్చిన వెంటనే బర్కీని బుధవారం రాత్రి పాకిస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్థాన్ పోలీసులు జైష్- ఎ- మహ్మద్ వ్యవస్థాపక నేత మౌలానా మసూద్ అజర్‌ను, ఆయన నలుగురు సోదరులను అరెస్టు చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిందనందుకు వారిని అరెస్టు చేశారు. లష్కర్-ఎ- తోయిబా వ్యవస్థాపక నేత హఫీజ్ ముహమ్మద్ సయీద్‌ను కూడా పాకిస్థాన్ అరెస్టు చేసింది. తాను లష్కర్- ఎ- తోయిబా నాయకత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన అరెస్టయిన తర్వాత ప్రకటించారు.
Comments
Story first published: Thursday, January 10, 2002, 23:53 [IST]