అమెరికాకు పాక్‌లోని తీవ్రవాదుల జాబితా
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి పని చేస్తున్న 42 మంది టెర్రరిస్టుల జాబితాను భారత హోం మంత్రి ఎల్.కె. అద్వానీ బుధవారం అమెరికా అటార్నీ జనరల్ జాన్ అష్క్రాఫ్ట్‌కు అందజేసినట్లు ఒక టెలివిజన్ నెట్‌వర్క్ వార్తను ప్రసారం చేసింది.
ఇంతకు ముందు భారత్ అందజేసిన 20 మంది పేర్లతో పాటు అఎn్ఘానిస్థాన్‌లోని తాలిబాన్‌కు చెందిన 14 మంది పేర్లు అమెరికా అటార్నీ జనరల్‌కు అందజేసిన జాబితాలో వున్నాయి. ఈ 14 మంది అఎn్ఘానిస్థాన్ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయినట్లు పారిపోయినట్లు చెబుతున్నారు.
తాలిబాన్ నేతల జాబితాలో తాలిబాన్ పాలనలో ఛీఫ్ జస్టిస్‌గా వున్న మౌల్వీ నూర్ మొహమ్మద్ సఖీబ్, ఆయన డిప్యూటీగా పని చేసిన మౌల్వీ ముసాజమ్ పేర్లు వున్నాయి. వీరిద్దరు కూడా పెషావర్‌లో వున్నట్లు భావిస్తున్నారు. తాలిబాన్ పాలనలోని ఏడుగురు మంత్రులు, ఇద్దరు ప్రొవిన్షియల్ గవర్నర్లు ఈ జాబితాలో వున్నారు.












Click it and Unblock the Notifications
