పాక్ మోసాలను సహించం: అద్వానీ
వాషింగ్టన్: తమ సహనాన్ని పరీక్షిస్తున్న పాకిస్థాన్ మరో మోసాన్ని భరించబోదని భారత హోం మంత్రి ఎల్.కె. అద్వానీ అన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో పాకిస్థాన్ ప్రతిసారీ తమ ప్రగాఢ సంయమనాన్ని మోసంతో పరీక్షిస్తోందని ఆయన అన్నారు.
భారత్ చేసిన న్యాయబద్ధమైన డిమాండ్లకు అనుకూలంగా స్పందించడం ద్వారా పాకిస్థాన్ తన నిజాయితీని రుజువు చేసుకోవాలని ఆయన అన్నారు. భారత్ కోరుతున్న 20 మంది ఉగ్రవాదులను అప్పగించాలని, పాకిస్థాన్‌లోని శిక్షణా శిబిరాలను, సౌకర్యాలను మూసివేయాలని, ఆయుధాల, డబ్బు పంపిణీని నిలిపేయాలని, పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ఆయుధాలను, మనుషులను చేరవేయడాన్ని ఆపేయాలని ఆయన పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
