చెన్నై:
సీనియర్
సినిమా
కెమెరామన్
కె.యస్.
ప్రకాష్
రావు
గురువారం
తెల్లవారుజామున
కన్ను
మూశారు.
గత
కొద్ది
రోజులుగా
ఆయన
అస్వస్థతతో
బాధపడుతున్నారు.
ప్రకాష్‌రావు
దర్శకేంద్రుడు
కె.
రాఘవేంద్రరావుకు
సోదరుడు.
ప్రకాశ్
రావు
మృతితో
తెలుగు
సినిమా
రంగం
దిగ్భ్రాంతికి
లోనయింది.
పలువురు
సినీ
ప్రముఖులు
ఆయన
భౌతిక
కాయాన్ని
సందర్శించి
నివాళులర్పించారు.
ఆయన
మృతి
సినీ
రంగానికి
తీరని
లోటని
వారన్నారు.
1963లో
కులగోత్రాలు
సినిమాతో
కెమెరామన్‌గా
పరిచయమైన
ప్రకాశ్
రావు
అనేక
సినిమాలకు
కెమెరామన్‌గా
పని
చేశారు.