ఉగ్రవాద దాడిలో కీలక వ్యక్తి గుర్తింపు
న్యూఢిల్లీ: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై, పెంటగాన్‌పై సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దాడికి సంబంధించి కీలక వ్యక్తిని గుర్తించారు. ఆల్ ఖయిదా ఆర్థిక అధిపతి ముస్తాఫా అహ్మద్ ఆల్- హవ్సావిని దాడికి సంబంధించి కీలక వ్యక్తిగా గుర్తించినట్లు అమెరికా మీడియా రాసింది. ఇతనే ఆల్ ఖయిదా కార్యకలాపాలకు నిధులు సమకూర్చేవాడని, దాడులకు కొద్ది ముందే కరాచీ నుంచి అతను అదృశ్యమయ్యాడని వార్తలు వెలువడ్డాయి.
బ్యాంకింగ్ నిబంధనల్లో లొసుగులు, ఇస్లామిక్ మిలిటెంట్లు ఎక్కువగా వున్న యుఎఇని ఫైనాన్షియల్ హబ్‌గా వాడుకుంటున్నట్లు ఆ పత్రిక రాసింది. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి అదృశ్యం కావడానికి, అమెరికాలో దాడులు జరగడానికి కొద్ది సేపటి ముందే మొహమ్మద్ అత్తా, ముగ్గురు ఇతర హైజాకర్లు దుబాయ్‌లో ఆల్ హవ్సావికి 25 వేల డాలర్లు పంపినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఆగస్టులో దుబాయ్‌లో తెరిచిన ఆల్- హవ్సావి నియంత్రణలోని బ్యాంక్ ఖాతాను వరల్డ్ ట్రేడ్ సెంటర్ దక్షిన టవర్‌పై అమెరికా విమానం ఢీకొట్టిన సంఘటనలో మరణించిన మరో వ్యక్తి ఫయీజ్ రషీద్ అల్ఖదీ బనిహమ్మద్ ఇచ్చాడు. ఈ ఖాతాకు సంబంధించి ఆల్- హవ్సావి బనిహమ్మద్‌కు ఎటిఎం, క్రెడిట్ కార్డు అందజేశాడు. హైజాకింగ్‌కు ముందు 8 వేల డాలర్లను బనిహమ్మద్ ఈ ఖాతాలోకి బదిలీ చేశాడు.
19 మంది హైజాకర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు రిసీట్స్‌ను, ఎటిఎం విత్‌డ్రాయల్స్‌ను, ఇతర లావాదేవీలను దర్యాప్తు అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications
