సీమ ముఠాలపై ఉక్కుపాదం

కడపఃఅభివృద్ధిని నిరోధిస్తున్న రాయలసీమ ముఠాలనునిర్ధాక్షిణ్యంగా అణిచివేయనున్నట్టుగాముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుచెప్పారు. 16వ జన్మభూమి కార్యక్రమం ముగింపుసందర్భంగా కడప జిల్లాలోని పెద్దముడియం గ్రామంలో జరిగిన కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగామాట్లాడుతూ, ఈ మధ్య వరదల కారణంగా నష్టపోయినవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాలచర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాయలసీమలోనిముఠానేతలు కోట్లాది రూపాయలను అక్రమంగాసంపాదించుకుంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధినిమాత్రం దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆయనఆరోపించారు. ముఠానేతలకు ప్రజలే బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ గ్రామానికి చంద్రబాబుహెలికాప్టర్లో వచ్చారు. ఈ గ్రామాన్ని పైలెట్‌సరిగ్గా గుర్తించకపోవడంతో చంద్రబాబుహెలికాప్టర్‌ 20 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లుకొట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+