విద్యార్థులకు పండుగే.. వారికి ఫ్రీ ల్యాప్ టాప్ లు.. తీపికబురు చెప్పిన మంత్రి!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ గురుకుల విద్యార్థుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఐఐఐటీ మరియు ఎన్‌ఐటీలలో అడ్మిషన్ సాధించిన బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ సమావేశంలో కీలక ప్రకటన

ఈ ముఖ్యమైన ప్రకటన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చేయబడింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహించారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, వివిధ విద్యా శాఖల అధికారులు, ఈడబ్ల్యూఐడీసీ, నవోదయ విద్యాలయాలు మరియు గురుకుల సొసైటీ అధికారులు హాజరయ్యారు.

Telangana BC Gurukul Students to Get Free Laptops for IIT IIIT NIT Admissions said Minister Ponnam Prabhakar

ల్యాప్‌టాప్‌లతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు

గురుకులాల్లో చదువుతున్న ఏ విద్యార్థి అయినా ఊహించని కారణాల వలన మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల సొసైటీని తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు ఫూలే విద్యా సంస్థల సొసైటీగా పునర్నామకరణ చేయాలని ఆమోదం తెలిపారు.70% పదోన్నతుల ద్వారా, 30% ప్రత్యక్ష నియామకాల ద్వారా ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు.

గురుకుల స్కూల్స్, కాలేజీలకు కంప్యూటర్లు

గురుకుల పాఠశాలలకు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, జూనియర్ కాలేజీలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో 12 సైనిక పాఠశాలల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురుకులాల విద్యార్థులకు అన్ని వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని తాజా ప్రకటనతో తెలుస్తుంది.

ప్రీ-ప్రైమరీ విద్యపై కూడా దృష్టి

తొమ్మిది జిల్లాల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం పూర్తయిందని పాఠశాల విద్యా డైరెక్టర్ నికోలస్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ నాటికి 80% స్కూళ్లలో, నవంబర్ నాటికి 100% స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

బయట పచ్చళ్ళు కొని లొట్టలేసుకుని తింటున్నారా? ఈ వీడియో చూస్తే చచ్చినా తినరు!
బయట పచ్చళ్ళు కొని లొట్టలేసుకుని తింటున్నారా? ఈ వీడియో చూస్తే చచ్చినా తినరు!

బాగా చదివే పిల్లలకు ల్యాప్ టాప్ లు వారి ప్రగతికి మరింత ఉపయోగం

ఈ నిర్ణయాలు బీసీ వర్గాల విద్యా అభివృద్ధికి బలమైన మైలురాయి అని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందడం వల్ల వారి చదువు మరింత సులభం అవుతుందని, నాణ్యతతో కూడిన ఎడ్యుకేషన్ అందుతుందని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో చేపడుతున్న ఈ కృషి బీసీ విద్యార్థుల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+