అనంతపురంః
అనంతపురం
జిల్లా
కదిరి
సబ్
జైలులో
ఒక
ఖైదీ
పరారయ్యాడు.
పై
అధికారులతో
మాట
పడాల్సి
వస్తుందని
ఆందోళన
చెందిన
జైలు
సూపరింటిండెంట్
ఫ్యానుకు
ఉరిపోసుకొని
ఆత్మహత్య
చేసుకున్నాడు.
అనంతపురం
జిల్లాలో
ఈ
సంఘటన
సంచలనం
సృష్టించింది.
గుంటూరు
జిల్లా
నరసరావు
పేటకు
చెందిన
వీరాంజనేయరెడ్డి
కదిరి
సబ్
జైలు
సూపరింటిండెంట్
గా
పనిచేస్తున్నారు.
గురువారం
జైలు
తనిఖీకి
వచ్చిన
సందర్బంగా
దారిదోపిడి
కేసుల్లో
నిందితుడైన
చిన్నవెంకటేశ్వర్లు
పరారైనట్లు
సిబ్బంది
చెప్పారు.
ఈలోగా
జిల్లా
జైళ్ళ
సూపరింటిండెంట్
నుంచి
వీరాంజనేయరెడ్డికి
హెడ్
క్వార్టర్
కు
రావలసిందిగా
పిలుపు
వచ్చింది.
దీంతో
పై
అధికారులతో
మాట
పడక
తప్పదని
భయపడ్డ
వీరాంజనేయరెడ్డి
ఇంటికి
వచ్చి
భార్యతో
తన
ఆవేదన
వెళ్ళబోసుకున్నాడు.
ఆ
తరువాత
ఓ
గదిలోకి
వెళ్ళి
చీరతో
ఫ్యాన్
కు
ఉరివేసుకొని
ఆత్మహత్య
చేసుకున్నాడు.
55
ఏళ్ళ
వీరాంజనేయ
రెడ్డికి
ఇద్దరు
కుమారులు
వున్నారు.
వీరాంజనేయ
రెడ్డి
ఇన్
ఛార్జి
సూపరింటిండెంట్
ను
పెట్టుకున్నారని,
అతని
నిర్లక్ష్యానికి
సార్
బలయ్యారని
సిబ్బంది
చెబుతున్నారు.