హైదరాబాద్‌ః మెదక్ జిల్లా సదాశివపేట మండల కేంద్రంలో శనివారం నాడు జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లుతున్న ఒక టాటాసుమో వ్యానును ఎదురుగా వస్తున్న లారీ సదాశివపేట ఎంఆర్‌ఒ కార్యాలయం ఎదుట ఢీ కొట్టింది. ప్రమాదంలో వ్యాను తుక్కుతుక్కు అయింది. అందులో వున్న ఆరుగురు ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో మరణించారు. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా కృష్ణానగర్ తాలూకాకు చెందిన వారని పోలీసులు చెప్పారు.