బికనీర్‌ః
రాజస్తాన్‌లోని
సైనిక
స్థావరంలో
శుక్రవారం
నాడు
అనూహ్యంగా
జరిగిన
పేలుళ్లు,
అగ్నిప్రమాదం
వెనక
విద్రోహలు
హస్తం
వున్నదని
ప్రభుత్వం
అనుమానిస్తున్నది.
ఈ
విషయం
రక్షణ
మంత్రి
జార్జ్
ఫెర్నాండెజ్
చెప్పారు.
ఈ
సంఘటనపై
కోర్ట్
ఆఫ్
ఎంక్వైరీకి
ఆదేశాలు
జారీ
చేశామని
అన్ని
కోణాల్లోంచి
దర్యాప్తు
జరుగుతుందని
ఆయన
చెప్పారు.
రాజస్తాన్
ముఖ్యమంత్రి
అశోక్
గెహ్లాట్‌తో
కలసి
శనివారం
నాడు
సంఘటన
జరిగిన
ప్రాంతాన్ని
ఆయన
సందర్శించారు.
గెహ్లాట్
కూడా
విద్రోహం
ఈ
సంఘటనకు
కారణం
కావచ్చనే
అనుమానిస్తున్నట్టు
జార్జ్
వివరించారు.
సరిహద్దుల్లోని
సైనిక
శిబిరాలకు
ఆయుధాలు,
మందుగుండు
సామాగ్రి
తీసుకుని
వెళ్తున్న
ట్రక్కుల్లో
ఒకదానిలో
మంటలు
చెలరేగడంతో
సుమారు
100
ట్రక్కుల్లోని
వెయ్యి
టన్నుల
మందుగుండు
సామాగ్రి
దగ్ధమయింది.
సంఘటనలో
ఇద్దరు
మరణించారు.
పేలుళ్లు,
విస్పోటనాలతో
బికనీర్
ప్రాంతం
దద్దరిల్లింది.
మిలిటరి
ట్రక్కుల్లోని
రాకెట్లు,
మోర్టర్లు
విచ్చలవిడిగా
గాల్లోకి
దూసుకుపోయి
ప్రజలను
భయభ్రాంతులను
చేశాయి.
దాదుపు
రెండు
వందల
ఎత్తువరకు
జ్వాలలు
చెలరేగాయి