చిత్తూరుః
చిత్తూరు
జిల్లా
నగరి
పట్టణంలోని
ఇందిరానగర్‌లో
శుక్రవారం
నాడు
అర్ధరాత్రి
జరిగిన
అగ్ని
ప్రమాదంలో
ఒకే
కుటుంబానికి
చెందిన
అయిదుగురు
సజీవ
దహనమయ్యారు.
విద్యుత్
షార్ట్
సర్క్యూట్
ప్రమాదానికి
కారణమని
చెబుతున్నా
మృతుల
కుటుంబ
సభ్యులు
మాత్రం
దీనిని
హత్యాకాండగా
ఆరోపిసున్నారు.
వరసగా
వున్న
మూడు
గుడిసెలు
ఒక్కసారిగా
నిప్పు
అంటుకోవడంతో
రెండు
గుడిసెల్లోని
వ్యక్తులు
తలుపులు
తీసుకుని
బయటకు
వచ్చి
ప్రాణాలు
రక్షించుకున్నారు.
మూడో
గుడిసెలోని
అయిదుగురు
మాత్రం
బయటకు
రాకుండా
ఎవరో
బయటనుంచి
ద్వారాలను
బంధించారు.
సక్కుబాయి
(45)
అనసూయ(22),
బాబు(23),
లక్ష్మీ(5),
తులసి(1)
మంటల్లో
చిక్కుకుని
సజీవ
దహనమయ్యారు.
ప్రాణరక్షణకోసం
వారు
చేసిన
ఆర్తనాదాలతో
పరిసర
ప్రాంతాల
ప్రజలు
మేలుకుని
మంటలను
అదుపుచేయడానికి
ప్రయత్నం
చేసేలోపలే
ఘోరం
జరిగిపోయింది.
సెంకడ్
షో
సినిమాకు
వెళ్లిన
కారణంగా
ఇంటి
యజమాని
మురగన్
మాత్రం
ప్రాణాలతో
బయటపడ్డాడు.
తాము
టీకొట్టు
నడిపిస్తున్న
రోజుల
నుంచి
తమను
వేధిస్తున్న
కొందరు
వ్యక్తులు
ఈ
దారుణకాండకు
కారణమని
ఇది
ప్రమాదవశాత్తు
జరగలేదని
మృతుల
బంధువులు
ఆరోపిస్తున్నారు.