హాంగ్‌కాంగ్‌లో దోపిడీకి గురైన ఇండియన్స్
హాంగ్‌కాంగ్: హాంగ్‌కాంగ్ గెస్ట్‌హౌస్‌లో ఇద్దరు సంపన్న వ్యాపారులు దోపిడీకి గురయ్యారు. వారి నుంచి పెద్ద మొత్తంలో ఆగంతకులు సొమ్ము దోచుకున్నట్లు పోలీసులు శనివారంనాడు పోలీసులు చెప్పారు.
తలుపు తీయగానే ఇద్దరు చైనా వ్యక్తులు లోనికి దూసుకొచ్చి భారత వ్యాపారవేత్తలను బెదిరించారు; కొట్టారు; కట్టి పడేశారు. ఆ తర్వాత చైనా వ్యక్తులు పెద్ద మొత్తం సొమ్ము ఉన్న సంచిని ఎత్తుకెళ్లారు. ఇందులో దాదాపు రెండు లక్షల డాలర్ల మేరకు సొమ్ము వుంటుందని భావిస్తున్నారు.
గాయపడిన వ్యాపార వేత్తలను ఆస్పత్రిలో చేర్చారు. భారతదేశం తీసికెళ్లేందుకు వ్యాపార వేత్తలు ఆ సొమ్ముతో మొబైల్ ఫోన్లు కొనాలనుకున్నారు.












Click it and Unblock the Notifications
