భారత్ సంయమనం వహించాలి: పావెల్
వాషింగ్టన్: ఉగ్రవాదులపై మరిన్ని చర్యలు తీసుకునేందుక పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పట్ల తన డిమాండ్ల విషయంలో సహనంతో వ్యవహరించాలని అమెరికా విదేశాంగ మంత్రి కాలిన్ పావెల్ భారత్ను కోరారు. జాతినుద్దేశించి ముషారఫ్ శనివారం చేసే ప్రసంగం నుంచి ఎక్కువగా ఆశించవద్దని కూడా ఆయన శుక్రవారం విజ్ఞప్తి చేశారు.
కాశ్మీరీ మిలిటెంట్లకు కళ్లెం వేసేందుకు ఇప్పటికే ముషారఫ్ కొన్ని చర్యలు తీసుకున్నట్లు తాను భారత ప్రభుత్వానికి తెలియజేశానని ఆయన చెప్పారు. పాకిస్థాన్ ఇప్పటికే తీసుకున్న పలు చర్యలు భారత్‌కు ఉత్సాహపూరితమైనవని ఆయన అన్నారు. తీవ్రవాదుల అరెస్టులను, వారి కార్యాలయాల మూసివేతను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముషారఫ్ తీసుకున్న ఆ చర్యలను గుర్తించాల్సి వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్, భారత్‌ల మధ్య యుద్ధం సంభవిస్తే ఉగ్రవాదంపై జరుపుతున్న అమెరికా పోరుకు పెద్ద దెబ్బ తగులుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
