ద్వైపాక్షిక అంశాలపైనే చైనా నేత చర్చ
న్యూఢిల్లీః ప్రదాని వాజ్‌పేయి ఇతర నేతలతో తాను ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపైనే చర్చలు జరుపనున్నట్టుగా భారత పర్యటనలో వున్న చైనా ప్రధాని ఝూ రోంగ్జి చెప్పారు. ఆదివారం నాడు ఆగ్రానుంచి ఢిల్లీ వచ్చిన రోంగ్జి సోమవారం నాడు రాష్ట్రపతి కె ఆర్ నారాయణ్‌ను కలుసుకున్నారు. ప్రధాని కార్యాలయం వద్ద ప్రధాని వాజ్‌పేయి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పారు. స్వాగత సత్కారాల తర్వాత ఆయన గౌరవ సైనికవందన స్వీకరించారు.












Click it and Unblock the Notifications
