ఇస్లామాబాద్‌ః
టెర్రరిజంపై
ఉక్కుపాదం
మోపనున్నట్టుగా
పాక్
ప్రజలనుద్దేశించి
ఆ
దేశాధినేత
ముషారఫ్
ప్రకటించిన
24
గంటల్లోనే
అధికార
యంత్రాంగం
ఆ
దిశగా
చర్యలు
ప్రారంభించింది.
మసీదులు,
మదర్సాల్లో
వున్న
అనేక
మంది
తీవ్రవాదులు
అరెస్టు
చేసి
ముషారఫ్
ప్రభుత్వం
జైష్,
లష్కర్
కార్యాలయాలకు
తాళం
వేసింది.
ఈ
కార్యాలయాల్లో
వున్న
తీవ్రవాద
నాయకులను
అరెస్టు
చేసింది.
పాక్
ప్రభుత్వం
తీవ్రవాద
సంస్థలపై
తీసుకుంటున్న
చర్యలకు
మిశ్రమ
ప్రతిస్పందన
వ్యక్తం
అవుతున్నది.
సగటు
ప్రజలు
ఈ
చర్యల
పట్ల
సంతృప్తిని
వ్యక్తం
చేస్తుండగా
విపక్షాలు
మాత్రం
రాజకీయ
లబ్దికోసం
ముషారఫ్
ప్రభుత్వం
భారత్
వత్తిడికి
దాసోహం
అన్నదని
ఆరోపిస్తున్నాయి.
ఇమ్రాన్
ఖాన్
బాహటంగానే
అసమ్మతి
గళం
విప్పారు.
అయితే
అంతర్జాతీయంగా
మాత్రం
ముషారఫ్
ప్రసంగానికి
అనూహ్యరీతిలో
ప్రశంసలు
వస్తున్నాయి.
కొన్ని
అభ్యంతరాలు,
అనుమానాలు
వున్నప్పటికీ
భారత్
కూడా
ముషారఫ్
ప్రసంగ
సరళ
పట్ల
సంతృప్తినే
వ్యక్తం
చేసింది.
మదర్సాలు,
మసీదుల
విషయంలో
ఇంత
స్పష్టంగా
మాట్లాడిన
పాక్
నేత
ఎవరూ
లేరని
అద్వానీ
వ్యాఖ్యానించారు.
నిషిద్ద
ఉగ్రవాద
సంస్థల
నేతల
అరెస్టులో
పోలీసులకు
సహకరించాల్సిందిగా
ఐఎస్‌ఐకి
కూడా
ముషారఫ్
గట్టిగా
ఆదేశాలు
జారీ
చేసినట్టుగా
చెబుతున్నారు.