అండిపట్టు నుంచి జయ పోటీ

చెన్నై: అన్నాడియంకె అధినేత్రి జయలలిత తమిళనాడులోని అండిపట్టి శాసనసభా నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. అన్నాడియంకె బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రకటనపై పార్టీ తరఫున జయలలితనే సంతకం చేశారు.

అండిపట్టి నియోజక వర్గానికి ఈ నెల 21వ తేదీన ఉప ఎన్నిక జరుగుతోంది. సైదాపేట్‌, వనియంబాది నియోజక వర్గాలకు ఎన్నికలకు వాయిదా వేస్తూ అండిపట్టి నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహిస్తూ ఎన్నికల కమిషన్‌ ప్రకటన చేసిన మర్నాడే ఈ ప్రకటన వెలువడడం విశేషం.

టాన్సీ భూకుంభకోణాకి సంబంధించిన రెండు కేసుల్లో మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత తాను అండిపట్టు నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశాలున్నట్లు ఆమె సూచించారు కూడా. జయలలిత పోటీ చేయడానికి వీలుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ శాసనసభ్యుడు తంగటమిజ్‌ సెల్వన్‌ రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+