రాంచిః బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాల జుడిషియల్ రిమాండ్‌ను మరికొంత కాలం పొడిగిస్తూ వేలకోట్ల రూపాయల దాణా కుంభకోణంపై విచారణ జరుపుతున్న సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
లాలూ డిసెంబర్ 20 నుంచి మిశ్రా డిసెంబర్ 24 నుంచి జుడిషియల్ కస్టడీలో వున్నవిషయం విదితమే. కేసు విచారణను జనవరి 28కి వాయిదా వేస్తూ మరో పన్నెండు రోజుల పాటు ఇద్దరు నేతలను జుడిషియల్ కస్టడీలోనే వుంచాలని న్యాయమూర్తి దాస్ ఆదేశించారు. లాలూ, మిశ్రా కాకుండా ఈ కేసులో మరో 73 మంది కూడా నిందితులుగా వున్నారు. వారిలో మంత్రులు, ఉన్నతాధికారులు వున్నారు.