న్యూఢిల్లీః
ఎలాంటి
విపత్కర
పరిస్థితినైనా
ఎదుర్కునేందుకు
భారత
నౌకాదళం
సిద్ధంగా
వున్నదని
భారత
నౌకాదళం
చీఫ్
అడ్మిరల్
మాధవేంద్రసింగ్
బుధవారం
నాడు
చెప్పారు.
అరేబియా
సముద్రంలో
భారత
యుద్ధ
నౌకలు
పూర్తి
సన్నద్ధంగా
వున్నాయని
ఆయన
చెప్పారు.
పొరుగు
దేశం
ఎలాంటి
దుస్సాహసానికి
పాల్పడినా
గట్టిగా
బుద్ధి
చెప్పడం
ఖాయమని
ఆయన
చెప్పారు.
భారత్
మొదట
అణు
దాడి
చేయదని
అయితే
ఎవరైనా
అలాంటి
సాహసం
చేస్తే
మాత్రం
దాడిని
తిప్పికొట్టడంతో
పాటు
వారికి
గట్టి
బుద్ధి
చెప్పగల
సత్తా
భారత్‌కు
వున్నదని
ఆయన
స్పష్టం
చేశారు.
రోజుకు
500
మైళ్ల
దూరం
ఆగకుండా
ప్రయాణించగల
నౌకలను
ఆయుధాలతో
సహా
అరేబియా
సముద్రంలో
మొహరించినట్టుగా
ఆయన
చెప్పారు.
యుద్ధం
అంటూ
వస్తే
నౌకాదళం
కీలక
పాత్ర
పోషించాల్సివుంటుందని
ఆయన
అన్నారు.
యుద్ధ
వాహక
నౌకలు
కూడా
సిద్ధంగా
వున్నాయని
ఆయన
చెప్పారు.
అఎn్గాన్
యుద్ధం
నేపథ్యంలో
అరేబియా
సముద్రంలో
మొహరించిన
అమెరికా
యుద్ధ
నౌకల
వల్ల
భారత్‌కు
సమస్యలు
వుండే
అవకాశం
లేదని
ఆయన
స్పష్టం
చేశారు.
అమెరికా
నౌకల
వల్ల
పరిస్థితి
కొంచెం
సంక్లిష్టం
కావచ్చునని
అయితే
దీనిగురించి
పెద్దగా
విచారించాల్సిన
అవసరం
లేదని
ఆయన
అన్నారు.
అమెరికా
కూడా
భారత్
పరిస్థితిని
సరిగ్గానే
అర్ధం
చేసుకుంటున్నదని
ఆయన
చెప్పారు.