ఖాట్మండుః నేపాల్‌లో మావోయిస్టు తిరుగుబాటుదారులు ఒక సెంట్రల్ జైలుపై దాడి జరిపి 30 మంది ఖైదీలు తప్పించుకునేలా చేశారు. సుర్కెత్ జైలులో బుధవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది.
తప్పించుకుపోయిన వారిలో మావోయిస్టు ఖైదీలతో పాటు ఇతర నేరాలు చేసిన వారు కూడా వున్నారు. ఖైదీలు జైలు కాంపౌండ్ వెనక వైపు 30 అడుగుల సొరంగం తవ్వినట్టు అధికారులు చెప్పారు. సాయుధ తీవ్రవాదులు తొలుత జైలుపై దాడి జరిపి కాపలా వున్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. దాదాపు గంటన్నర సేపు భద్రతాసిబ్బంది దృష్టిని మళ్లించారు. ఎదురు కాల్పులు జరుగుతుండగా మరో వైపు మరికొంత మంది సాయుధులు జైల్‌లోని ఖైదీలను తప్పించే ప్రయత్నాలు చేశారు.