భారత్ పాక్ లకు చర్చలే శరణ్యంఃపావెల్
వాషింగ్టన్‌ః దక్షిణాసియాలో శాంతిస్థాపనకు గాను భారత్ పాక్ లు చర్చలు జరపాలని అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్ పావెల్ పిలుపునిచ్చారు. సరిహద్దుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడం కంటే ఉభయదేశాలు చర్చలు జరపడం తక్షణావసరం అని ఆయన అన్నారు. భారత్ - పాక్ లలో పర్యటించేందుకు వస్తున్న సమయంలో ప్రత్యేక విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
భారత్ - పాకిస్తాన్ లో అమెరికాకు సత్సంబంధాలున్నాయి.... అయితే కాశ్మీర్ సమస్యను ఆ రెండు దేశాలే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పావెల్ వ్యాఖ్యానించారు.పావెల్ బుధవారం పాకిస్తాన్ చేరుకున్నారు. ఆయన అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించి ఆ తరువాత భారత దేశంలో పర్యటిస్తారు. ఆ తరువాత నేపాలో అక్కడి నుంచి జపాన్ లో పావెల్ పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications
