వంటగ్యాస్, కిరోసిన్ ధరల పెంపు
న్యూఢిల్లీ: కిరోసిన్, వంటగ్యాస్ ధరలు పెరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్ సూచనప్రాయంగా తెలిపారు. లీటర్ కిరోసిన్ ధర 70 నుంచి 75 పైసల వరకు పెరుగుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కిరోసిన్‌పై సబ్సిడీని 33 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కిరోసిన్‌పై ప్రస్తుతం 37 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.
ఇందులో భాగంగానే కిరోసిన్‌పై సబ్సిడీని 33 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని రామ్‌నాయక్ చెప్పారు. వంటగ్యాస్‌పై ప్రస్తుతం వున్న 40 శాతం సబ్సిడీని ఒక్కసారిగా 15 శాతానికి తగ్గిస్తే సిలిండర్ ధర ఒక్కసారిగా 90 రూపాయలు పెరుగుతుంది. దీన్ని దృష్టిలో వుంచుకుని వంట గ్యాస్‌పై సబ్సిడీని వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో దశలవారీగా 15 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
పెట్రోలియం రంగంపై నియంత్రణ తొలిగించిన తర్వాత దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తుల రిటైల్ రేట్లు వేర్వేరుగా వుండకుండా ప్రభుత్వం చేసుకుంటుందని ఆయన అంతకు ముందు సదస్సులో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో సంభవించే భారీ హెచ్చుతగ్గుల ప్రభావం నేరుగా వినియోగదారుడిపై పడకుండా ప్రభుత్వం జోక్యం అవసరమని ఆయన అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెట్రోలియం రంగంపై ప్రభుత్వ నియంత్రణను తొలగించేందుకు సంసిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
